![]() |
![]() |
.webp)
బుల్లితెర మీద కన్నడ నటుడు నిఖిల్ గురించి తెలియని వారుండరు. అలాంటి నిఖిల్ బిగ్ బాస్ కి కూడా వెళ్ళొచ్చాడు. అలాంటి నిఖిల్ ఒక చిట్ -చాట్ షోలో చాలా విషయాలు చెప్పుకొచ్చాడు. "నా పేరు నిఖిల్ మలియక్కల్. నేను పుట్టి పెరిగింది కర్ణాటక మైసూర్. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి. స్కూల్ , కాలేజ్ కి వెళ్తూ బంక్ కొడుతూ ఉన్న ప్రాసెస్ లో ఒక సినిమా ఆఫర్ వచ్చింది. కన్నడలో ఒక రెండు సినిమాలు చేసిన తర్వాత ఒక సీరియల్ చేసాను అలాగే ఒక 20 - 25 వరకు థియేటర్ షోస్ చేసాను. ఆ తర్వాత మళ్ళీ ఒక ఆడిషన్ చేసి ఒక తెలుగు సీరియల్ లో అవకాశం ఇచ్చారు. అలా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ దొరికిన ప్రేమ సపోర్ట్ జనాల దగ్గర నుంచి లభించింది. నేను బ్లేస్డ్ అని చెప్పొచ్చు. నేను ఇంతవరకు వచ్చాను అంటే అది నా జర్నీ మాత్రమే కాదు నన్ను ఇష్టపడి నన్ను నడిపించిన ఒక్కొక్కరి జర్నీ ఇది." అని చెప్పుకొచ్చాడు. "మీ లైఫ్ ని చేంజ్ చేసిన ఆ ఒక్క రోజు ఏంటి" అని అడిగేసరికి "ఎక్స్పెక్టింగ్ మానేసిన రోజు నా లైఫ్ చేంజ్ అయ్యింది" అని చెప్పాడు. "పేరెంట్స్ తో అబద్ధమాడిన సిట్యువేషన్" "చాలా ఉన్నాయి.
ఫీజు కట్టాలి అని డబ్బులు తీసుకెళ్లి ఎంజాయ్ చేసిన ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. చిన్నప్పుడు ఉన్న గర్ల్ ఫ్రెండ్ కి కేక్ కొనివ్వడానికి అమ్మ బ్యాంగిల్ దొంగతనం చేసాను అలాగే అమ్మ పర్సులోంచి 100 , 50 దొంగతనం కూడా చేసాను" అని చెప్పాడు. "మీరు కాకుండా బిగ్ బాస్ లో టాప్ 3 నేమ్స్ ఎవరివి చెప్తారు".." విష్ణు ప్రియా, నబీల్, పృద్వి" అని చెప్పాడు. "మీరు వర్క్ చేసిన సీరియల్స్ లో టాప్ 3 చెప్పాలంటే ఎవరి పేర్లు చెప్తారు".. "భవ్య, శిరీష, ఆయేషా" అని చెప్పాడు. "మీ హిడెన్ టాలెంట్ ఏంటి". "చాలా ఉన్నాయి. టీజ్ చేస్తూ ఉంటాను, కౌంటర్లు వేసి నవ్విస్తూ ఉంటాను. నేను చాల లేజీ అదే సీక్రెట్" అని చెప్పాడు. "వన్ సైడ్ లవ్ స్టోరీ ఏమన్నా ఉందా".."వన్ సైడ్ కాదు అన్నీ డబుల్ సైడ్..చిన్నప్పుడు నాకు మా టీచర్ అంటే ఇష్టం. ఆవిడ నా క్రష్ " అని చెప్పాడు. " మీ లైఫ్ లో మీరు రిగ్రెట్ ఫీలైన పరిస్థితి".."రిగ్రెట్ అంటూ ఏమీ లేదు. ప్రతీ పరిస్థితి ఏదో ఒక గుణపాఠం నేర్పిస్తుంది. "ఇప్పటి వరకు చేసిన సీరియల్స్ లో ఏది ఇష్టం" అనేసరికి "ఆర్టిస్ట్ గా నేను చేసిన అన్ని ప్రాజెక్ట్స్ నాకు ఇష్టం. ఐతే ఫస్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడూ బెస్ట్ అనుకుంటాం కదా అలా నా ఫస్ట్ ప్రాజెక్ట్ గోరింటాకు ఇష్టం. ఈ సీరియల్ ద్వారానే నేను తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టగలిగాను" అని చెప్పాడు. "మీకు తెలుగు, కన్నడ ఏ ఇండస్ట్రీ ఇష్టం".. "ఒక్కటి చెప్పడం అంటే కష్టం. ఆర్టిస్ట్ అనేవాళ్లకు బోర్డర్స్ ఉండవు, భాషతో సంబంధం ఉండదు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంటే నాకు ఇష్టం" అని చెప్పాడు.
![]() |
![]() |